
జనరల్

తెలుగు యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి నచికేత్ భట్రాజు తుర్కియే జూనియర్ ఓపెన్‌లో విజేతగా నిలిచి మరో అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇస్తాంబుల్‌లో జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో ఆతిథ్య దేశానికి చెందిన టాప్‌సీడ్ మెమెత్ టోరెమిస్‌ను 21-11, 23-21తో వరుస గేముల్లో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.
ఇటీవల ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ జూనియర్ టైటిల్ గెలిచిన నచికేత్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. హైదరాబాద్‌లోని చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ యువ షట్లర్, వరుస విజయాలతో భారత బ్యాడ్మింటన్ భవిష్యత్ ఆశాకిరణంగా నిలుస్తున్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!