
జనరల్

టీ20 వరల్డ్ కప్ 2026 తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడంతో ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. జట్టుకు దూరమైన తర్వాత సూర్య ఒక ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు మీడియా అతనిని ఫ్యాన్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారని ప్రశ్నించింది.
దానికి సూర్య తనదైన సరదా శైలిలో స్పందిస్తూ, “అబ్బా.. నన్నా? అలా అయితే నేను లేకపోయినా అంతా బాగానే సాగుతోంది కదా!” అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని మాటలను భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు పరోక్ష కౌంటర్‌గా భావిస్తూ అభిమానులు విభిన్న కామెంట్లు చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!