

ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఫ్రాంచైజీ తెలుగు బ్లాక్ హాక్స్ జట్టు ప్రతిష్టాత్మక సెంట్రల్ ఏషియన్ వాలీబాల్ అసోసియేషన్ (కావా) వాలీబాల్ క్లబ్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై మీటియర్స్తో తలపడిన బ్లాక్ హాక్స్ 20–25, 25–19, 25–22, 25–18 స్కోర్లతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టోర్నీలో సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.
ఈ విజయంపై జట్టు యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక టోర్నీలో సెమీఫైనల్‌కు చేరడం తెలుగు బ్లాక్ హాక్స్ జట్టుతో పాటు భారత వాలీబాల్‌కు కూడా గర్వకారణమని పేర్కొన్నారు. అర్జెంటీనాకు చెందిన ఏరియల్ గార్సియా ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టులో అర్జెంటీనా ఆటగాడు ఫెడెరికో పెరెయిరా, డొమినికన్ రిపబ్లిక్కు చెందిన హెక్టర్ అలెక్సిస్ క్రజ్, బ్రెజిల్ ఆటగాడు హెన్రిక్ మీరెలెస్ వంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!