

టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో 17 ఏళ్ల అతడి రెడ్ బాల్ కెరీర్‌కు తెరపడింది. సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించిన చాహల్.. భారత్ తరఫున టెస్టు క్యాప్ అందుకోవాలన్న తన కల నెరవేరలేదని భావోద్వేగంగా పేర్కొన్నాడు. లార్డ్స్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున మిడిల్సెక్స్‌తో ఆడిన మ్యాచ్ తన చివరి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ అని తెలిపాడు. రెడ్ బాల్ క్రికెట్ తనకు ఓపిక, వ్యక్తిత్వం, పోరాట పటిమను నేర్పిందని, టెస్టు ఆడలేకపోయినా తన ప్రయాణం పట్ల సంతృప్తిగా ఉన్నానని చెప్పాడు.
2009లో హర్యానా తరఫున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన చాహల్.. 49 మ్యాచ్‌ల్లో 32.27 సగటుతో 148 వికెట్లు పడగొట్టాడు. 2026 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున ఐదు మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు తీశాడు. భారత్ తరఫున 72 వన్డేలు, 80 టీ20లు ఆడిన చాహల్.. 2024 టీ20 ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2023 ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్ తర్వాత అతడు భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. అయితే తన క్రికెట్ ప్రయాణం ఇక్కడితో ముగియలేదని స్పష్టం చేసిన చాహల్.. వన్డేలు, టీ20ల్లో భారత్ తరఫున మరో అవకాశం కోసం ప్రయత్నించనున్నాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!