

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 35 శాతం జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే ఆలస్యమైన ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధిస్తారు. అయితే ఈ పెనాల్టీ గరిష్ఠంగా 50 శాతానికి పరిమితమవుతుంది. ఐదో వన్డేలో భారత్ నిర్ణీత సమయంలో ఏడు ఓవర్లు తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలె 35 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
భారత వన్డే జట్టు తాత్కాలిక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ శిక్షను అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా పోయింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన భారత్ సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. సిరీస్ విజయంతో సంతోషంలో ఉన్న టీమిండియాకు స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!