

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేశ్ రైనా.. మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్‌కు ఆటగాడిగా వీడ్కోలు పలకడానికి గల కారణంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. జియో హాట్‌స్టార్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రైనా.. పదేపదే వేధిస్తున్న మోకాళ్ల సమస్యల కారణంగానే ధోని ఆటకు దూరం కావాల్సి వస్తోందని తెలిపాడు. ధోని రెండు మోకాళ్లలోనూ వాపు, నొప్పి ఉన్నాయని వెల్లడించాడు. ఎన్నో ఏళ్లుగా వికెట్ కీపింగ్ చేయడం, వరుసగా మ్యాచ్‌లు ఆడటం వల్ల అతడి శరీరంపై ప్రభావం పడిందని అభిప్రాయపడ్డాడు.
ఫిట్‌నెస్ తిరిగి సాధించేందుకు ధోని జిమ్‌లో ఎంతో శ్రమించాడని, ఇంకా ఆట కొనసాగించాలని కోరుకున్నప్పటికీ శరీరం సహకరించడం లేదని రైనా పేర్కొన్నాడు. సీఎస్కే విజయాల్లో ధోని పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించాడు. జట్టుకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో, ఇన్నేళ్లుగా విజయవంతంగా కొనసాగడంలో ధోని కృషి ఎంతో ఉందన్నాడు. అభిమానుల నుంచి, ముఖ్యంగా 'విజిల్ పోడు ఆర్మీ' నుంచి అతడికి లభించిన మద్దతు మరువలేనిదని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ధోని అతిపెద్ద బ్రాండ్లలో ఒకరని రైనా కొనియాడాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!