
జనరల్

వాట్సప్ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఈ-సిమ్ సదుపాయాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ ద్వారా విదేశీ ప్రయాణాల సమయంలో మొబైల్ నంబర్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేకుండా వాట్సప్‌ను ఉపయోగించుకునే అవకాశం కలగనుంది.
ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి వస్తే విదేశాలకు వెళ్లే వారికి మరింత సౌకర్యంగా ఉండనుంది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో తమ ప్రస్తుత నంబర్‌తోనే వాట్సప్ సేవలను కొనసాగించేందుకు వీలవుతుంది. అయితే ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది, దాని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!