

భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన జూపిటర్ స్కూటర్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ స్కూటర్ ఉత్పత్తి కోటి యూనిట్ల మైలురాయిని దాటినట్లు సంస్థ ప్రకటించింది. తమిళనాడులోని హోసూరు తయారీ కేంద్రం నుంచి కోటి యూనిట్ స్కూటర్‌ను విడుదల చేశారు. 2013లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన జూపిటర్ సుమారు 13 ఏళ్లలో ఈ ఘనత సాధించింది. తొలి 50 లక్షల యూనిట్ల ఉత్పత్తికి తొమ్మిదేళ్లు పట్టగా, ఆ తర్వాతి 50 లక్షల యూనిట్లను కేవలం నాలుగేళ్లలోనే పూర్తి చేసింది. దేశీయ స్కూటర్ మార్కెట్‌లో టీవీఎస్ స్థానం బలపడటంలో జూపిటర్ కీలక పాత్ర పోషించింది.
ప్రస్తుతం టీవీఎస్ జూపిటర్ 110సీసీ, 125సీసీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. జూపిటర్ 110లో 113.3సీసీ ఇంజిన్ ఉండగా, జూపిటర్ 125లో 124.8సీసీ ఐగో అసిస్ట్ ఇంజిన్‌ను అందించారు. రెండు మోడళ్లలోనూ సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 5.1 లీటర్ల ఇంధన ట్యాంక్, 163 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్, రెండు హెల్మెట్లు పెట్టుకునేంత సీటు కింద స్టోరేజ్, స్మార్ట్‌కనెక్ట్ వంటి ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అందించిన సమాచారం ప్రకారం, జూపిటర్ 110 ఎక్స్‌షోరూమ్ ధర రూ.76,200 నుంచి రూ.92,225 వరకు ఉండగా, జూపిటర్ 125 ధర రూ.88,580 నుంచి రూ.96,765 వరకు ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!