

ఆంత్రోపిక్ తన క్లాడ్ AI సేవలను గూగుల్ వర్క్‌స్పేస్‌కు విస్తరించింది. దీంతో గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్‌లోనే నేరుగా క్లాడ్ AIని ఉపయోగించుకునే అవకాశం లభిస్తోంది. ‘క్లాడ్ ఫర్ గూగుల్ వర్క్‌స్పేస్’ ప్రస్తుతం చెల్లింపు క్లాడ్ ప్లాన్లకు పబ్లిక్ బీటా రూపంలో అందుబాటులోకి వచ్చింది. యూజర్లు గూగుల్ ఫైల్ పక్కనే సైడ్‌బార్‌లో క్లాడ్‌ను ఓపెన్ చేసి, ట్యాబ్‌లు లేదా యాప్‌లు మార్చకుండానే కంటెంట్‌ను చదివించడం, మార్చడం వంటి పనులు చేయవచ్చు.
గూగుల్ డాక్స్‌లో వాక్యాలను సరిచేయడం, హెడ్డింగ్‌లను మార్చడం, పెద్ద డాక్యుమెంట్లకు ఎడిటింగ్ సూచనలు, సమ్మరీలు, టేబుళ్లు రూపొందించడం క్లాడ్ చేయగలదు. షీట్స్‌లో ఫార్ములాలు రాయడం, పివట్ టేబుళ్లు, చార్టులు రూపొందించడం, కొత్త ట్యాబ్‌లు జోడించడం వంటి పనులు చేయవచ్చు. స్లైడ్స్‌లో ఇప్పటికే ఉన్న థీమ్‌కు సరిపోయే కొత్త స్లైడ్లు రూపొందించడంతో పాటు, ఓవర్‌ల్యాప్ అవుతున్న లేదా చదవడానికి కష్టంగా ఉన్న అంశాలను గుర్తించగలదు. మార్పులను ముందుగా అనుమతించే ‘Ask before edits’, ఆటోమేటిక్‌గా మార్పులు చేసే ‘Accept all edits’ అనే రెండు మోడ్‌లు ఉన్నాయి. Google Workspace Marketplace నుంచి క్లాడ్‌ను ఇన్‌స్టాల్ చేసి, అవసరమైన కనెక్టర్లను ఎనేబుల్ చేసుకోవచ్చు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!