

వాట్సాప్ తన ఐఓఎస్ యాప్ కోసం కొత్త మెసేజ్ బబుల్ డిజైన్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. కొత్త ఇంటర్ఫేస్లో చాట్ బబుల్స్ ప్రస్తుతం ఉన్న వాటితో పోలిస్తే మరింత గుండ్రంగా, సాఫ్ట్ లుక్‌తో కనిపించనున్నాయి. డబ్ల్యూఏబీటాఇన్ఫో నివేదిక ప్రకారం, వాట్సాప్ ఐఓఎస్ బీటా వెర్షన్ 26.29.10.70లో ఈ మార్పులు కనిపించాయి. ప్రస్తుతం ఎంపిక చేసిన టెస్ట్‌ఫ్లైట్ బీటా టెస్టర్లకు ఈ డిజైన్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. కొంతమంది స్టేబుల్ యాప్ స్టోర్ వెర్షన్ వినియోగదారులకు కూడా ఈ మార్పులు కనిపించే అవకాశం ఉంది. కొత్త బబుల్స్ డిజైన్ ఐమెసేజ్ చాట్ స్టైల్‌ను పోలి ఉండటంతో పాటు యాపిల్ లిక్విడ్ గ్లాస్ డిజైన్‌కు అనుగుణంగా కనిపిస్తోంది.
కొత్త డిజైన్‌తో వాట్సాప్ చాట్లలో ఫొటోలు, వీడియోలు, GIFలు కనిపించే విధానం కూడా మారనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మీడియా చుట్టూ కనిపించే సంప్రదాయ మెసేజ్ బబుల్ బోర్డర్లు తొలగించి, మరింత క్లీన్‌గా చూపించేలా మార్పులు చేస్తున్నారు. ఈ కొత్త డిజైన్‌ను ఐఫోన్ యూజర్లందరికీ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై వాట్సాప్ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే బీటా టెస్టింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలో మరింత మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, టూ-స్టెప్ వెరిఫికేషన్ పిన్ స్థానంలో పాస్‌వర్డ్‌ను ఉపయోగించే సెక్యూరిటీ ఫీచర్‌తో పాటు ఆండ్రాయిడ్, ఐఓఎస్ లో యూజర్‌నేమ్ సపోర్ట్ వంటి ఫీచర్లపైనా వాట్సాప్ పనిచేస్తున్నట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!