

ఆర్‌బీఐ చట్టం కింద గుర్తింపు పొందిన షెడ్యూల్డ్ బ్యాంకుల జాబితా నుంచి పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తొలగించింది. బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ గతంలో లైసెన్స్ రద్దు చర్యలు చేపట్టింది.
లైసెన్స్ రద్దు అనంతరం పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌ను మూసివేయాలని ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆర్‌బీఐ చట్టం-1934లోని రెండో షెడ్యూల్ నుంచి పీపీబీఎల్ పేరును తొలగించినట్లు కేంద్ర బ్యాంక్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి జూలై 31న నోటిఫికేషన్ జారీ చేయగా, సెప్టెంబర్‌లో గెజిట్‌లో ప్రచురించినట్లు తెలిపింది.
ఆర్‌బీఐ చట్టంలోని రెండో షెడ్యూల్‌లో నిర్దేశిత ఆర్థిక, నియంత్రణ ప్రమాణాలను పాటించే షెడ్యూల్డ్ బ్యాంకుల అధికారిక జాబితాను ఆర్‌బీఐ నిర్వహిస్తుంది. పీపీబీఎల్ పేరును ఈ జాబితా నుంచి తొలగించడంతో షెడ్యూల్డ్ బ్యాంకుగా దాని గుర్తింపు కూడా ముగిసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!