

ప్రముఖ దక్షిణ భారతీయ రెస్టారెంట్ బ్రాండ్ ‘ది రామేశ్వరం కేఫ్’కు న్యాయస్థానంలో ఊరట లభించింది. తమ పేరు, లోగోను పోలిన బోర్డులను ప్రదర్శించకుండా ముంబయి, ఉడుపి, కుందాపుర, తెలంగాణలోని కొన్ని రెస్టారెంట్లపై సిటీ కోర్టు ఆంక్షలు విధించినట్లు సంస్థ వెల్లడించింది. ఇతర హోటళ్లు తమ బ్రాండ్ గుర్తింపును పోలిన పేర్లు, లోగోలను ఉపయోగించడం వల్ల వినియోగదారులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని రామేశ్వరం కేఫ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల వివరాలను సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది.
తమ బ్రాండ్‌ను పోలిన పేర్లు, గుర్తులు ఉపయోగించడం వల్ల ఆయా రెస్టారెంట్లు తమ శాఖలుగా లేదా అధికారిక ఫ్రాంచైజీలుగా వినియోగదారులు భావించే ప్రమాదం ఉందని సంస్థ వాదించింది. బెంగళూరులో 2021లో రాఘవేంద్ర రావు, దివ్య రాఘవేంద్ర రావు స్థాపించిన రామేశ్వరం కేఫ్.. గీ పొడి ఇడ్లీ, బెన్నె దోశ, ఫిల్టర్ కాఫీ వంటి వంటకాలతో గుర్తింపు పొందింది. హైదరాబాద్, పుణె, ముంబయి సహా పలు నగరాలకు విస్తరించింది. సంప్రదాయ కొలం డిజైన్ల స్ఫూర్తితో రూపొందించిన లోగో, ఆలయ శైలిని ప్రతిబింబించే రెస్టారెంట్ ఇంటీరియర్లు ఈ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. కోర్టు ఉత్తర్వులపై ఆన్‌లైన్‌లో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆదేశాల పూర్తి పరిధి, ప్రభావం తెలుసుకోవాలంటే కోర్టు ఉత్తర్వులను పరిశీలించాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!