

యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్ మరణించి 2026 అక్టోబర్ 5 నాటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. టెక్నాలజీ రంగంతో పాటు యాపిల్‌పై ఆయన చూపిన ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. జాబ్స్ సన్నిహిత మిత్రుడు, మాజీ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనను స్మరించుకున్నారు. జాబ్స్ ప్రపంచాన్ని, ఎంతోమంది జీవితాలను మార్చారని, తన జీవితాన్నీ శాశ్వతంగా మార్చారని కుక్ పేర్కొన్నారు. ఆయన సృష్టించిన ప్రతిదానిలో, ఆయన స్ఫూర్తినిచ్చిన ప్రతి ఒక్కరిలో జాబ్స్ స్ఫూర్తి ఇప్పటికీ జీవిస్తోందని అన్నారు.
ప్రస్తుత యాపిల్ సీఈఓ జాన్ టెర్నస్ కూడా స్టీవ్ జాబ్స్‌కు నివాళులర్పించారు. ప్రతి అంశంలోని చిన్న వివరాలకు, ప్రతి అనుభవానికి, ప్రతి వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వాలని జాబ్స్ నేర్పిన విధానం ఇప్పటికీ యాపిల్ పనితీరుకు మార్గదర్శకంగా ఉందని టెర్నస్ తెలిపారు. కృత్రిమ మేధ, స్పేషియల్ కంప్యూటింగ్ వంటి కొత్త రంగాల్లోకి యాపిల్ విస్తరిస్తున్నప్పటికీ, సరళత, డిజైన్, వినియోగదారు అనుభవంపై జాబ్స్ ఆలోచనల ప్రభావం కొనసాగుతోందని ఈ నివాళులు స్పష్టం చేస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!