

భారత్లో హెల్త్ సప్లిమెంట్స్ మార్కెట్ గణనీయంగా విస్తరించనుందని రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 2026 ఆర్థిక సంవత్సరంలో 5.3 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్.. 2031 నాటికి దాదాపు రెట్టింపై 9.4 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన, వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే ఆసక్తి, ప్రోటీన్, పోషకాహార ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
ఆన్లైన్ షాపింగ్ విస్తరణ, డిజిటల్ ఆధారిత బ్రాండ్ల ఆదరణ కూడా ఈ మార్కెట్ అభివృద్ధికి దోహదం చేయనున్నాయి. ముఖ్యంగా ప్రోటీన్ ఉత్పత్తులు, స్పోర్ట్స్ న్యూట్రిషన్, ప్రత్యేక పోషకాహార సప్లిమెంట్స్ కీలక వృద్ధి విభాగాలుగా మారుతున్నాయి. ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి, ముందస్తు ఆరోగ్య సంరక్షణపై వినియోగదారులు ఎక్కువగా దృష్టి సారిస్తుండటంతో రానున్న సంవత్సరాల్లో ఈ రంగం మరింత విస్తరించే అవకాశముంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!