

దేశీయ స్టాక్ మార్కెట్లు నవంబర్ 20న కూడా భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 898 పాయింట్లు పెరిగి 83,920 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 286 పాయింట్లు లాభపడి 25,801 వద్ద ముగిసింది. ఈ సానుకూల మార్కెట్ పరిస్థితుల్లో దేశంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మళ్లీ పుంజుకోవడం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో భారీగా పడిపోయి 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకిన ఈ షేరు నవంబర్ నెలలో దాదాపు 14 శాతం లాభపడింది. నవంబర్ 20న స్వల్ప లాభంతో రూ.1,377.50 వద్ద ముగిసింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో సుమారు 3 శాతం పెరిగింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.18.60 లక్షల కోట్లుగా ఉంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ.1,611.80 కాగా, కనిష్ఠ ధర రూ.1,152.20గా నమోదైంది.
రిలయన్స్ షేర్ల పెరుగుదలకు తోడుగా ప్రమోటర్ గ్రూప్ సంస్థల కొనుగోళ్లు కూడా చర్చనీయాంశంగా మారాయి. నవంబర్ 16న ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ప్రమోటర్ గ్రూప్‌కు చెందిన రెండు సంస్థలు కలిపి 4.26 లక్షల షేర్లను కొనుగోలు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ 2,11,590 షేర్లను కొనుగోలు చేయడంతో ఆ సంస్థ మొత్తం వాటా సుమారు 18.49 కోట్ల షేర్లకు చేరింది. మరో సంస్థ రిలయన్స్ సర్వీసెస్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ 2,15,000 షేర్లను కొనుగోలు చేయడంతో దాని వాటా 34.38 కోట్ల షేర్లకు పెరిగింది. సెప్టెంబర్ 2026 త్రైమాసికం నాటికి కంపెనీలో ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థల మొత్తం వాటా 50.44 శాతంగా ఉంది. రెండో త్రైమాసికంలో నమోదైన సానుకూల ఆర్థిక ఫలితాలు, జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓపై అంచనాలు కూడా షేరు పుంజుకోవడానికి తోడ్పడిన అంశాలుగా భావిస్తున్నారు. అయితే షేర్లలో పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ ఒడిదుడుకులు, కంపెనీ ఆర్థిక పరిస్థితులను పరిశీలించడం అవసరం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!