

విదేశీ బ్యాంకుల్లో భద్రపరిచిన భారత బంగారు నిల్వలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వేగంగా స్వదేశానికి తరలిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆరు నెలల కాలంలో సుమారు 60 టన్నుల బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చింది. దీంతో ఆర్‌బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారు నిల్వల్లో 84.06 శాతం ప్రస్తుతం దేశంలోనే భద్రంగా ఉన్నాయి. 2026 సెప్టెంబర్ 30 నాటికి ఆర్‌బీఐ వద్ద మొత్తం 880.52 టన్నుల బంగారం ఉండగా, అందులో 740.13 టన్నులు భారత్‌లోనే నిల్వ ఉన్నాయి. మిగిలిన 140.39 టన్నుల బంగారం విదేశాల్లో, ప్రధానంగా బ్రిటన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (బీఐఎస్) వద్ద భద్రపరిచారు.
2021 మార్చి నాటికి భారత్ వద్ద కేవలం 42 శాతం బంగారు నిల్వలు మాత్రమే ఉండేవి. విదేశీ బ్యాంకులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి సమయంలో దేశ బంగారు నిల్వలపై మరింత నియంత్రణ కలిగి ఉండేందుకు ఆర్‌బీఐ ఈ చర్యలు చేపడుతోంది. ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో 8,133 టన్నులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, చైనా, రష్యా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!