

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో వారాన్ని నష్టాలతో ముగించాయి. సెప్టెంబర్ 25తో ముగిసిన వారంలో నిఫ్టీ 23,140.50 వద్ద స్థిరపడింది. ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ అధికంగా ఉండటం, విదేశీ మదుపరుల విక్రయాలు మార్కెట్‌పై ఒత్తిడి పెంచాయి. అయితే దేశీయ సంస్థాగత మదుపరుల కొనుగోళ్లు కొంతమేరకు అండగా నిలిచాయి. సాంకేతికంగా 23,000 స్థాయి నిఫ్టీకి కీలక మద్దతుగా, 23,250–23,400 స్థాయిలు నిరోధంగా ఉండనున్నాయి.
ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో దూకుడైన ట్రేడింగ్‌కు దూరంగా ఉండి, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఫార్మా వంటి రక్షణాత్మక రంగాల్లో నాణ్యమైన షేర్లపై దృష్టి పెట్టాలని మార్కెట్ నిపుణుడు మూర్తి నాయుడు పాదం సూచించారు. గ్రాన్యూల్స్, ఎస్‌జీ ఫిన్‌సర్వ్, క్యూపిడ్, స్కిప్పర్, బజాజ్ కన్స్యూమర్ షేర్లను పరిశీలించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆయన సూచించిన స్థాయిల ప్రకారం.. గ్రాన్యూల్స్ ₹860 పైన కొనుగోలు, లక్ష్యం ₹925, స్టాప్‌లాస్ ₹845; ఎస్‌జీ ఫిన్‌సర్వ్ ₹600 పైన కొనుగోలు, లక్ష్యం ₹675, స్టాప్‌లాస్ ₹580; క్యూపిడ్ ₹260 పైన కొనుగోలు, లక్ష్యం ₹310, స్టాప్‌లాస్ ₹250; స్కిప్పర్ ₹550 పైన కొనుగోలు, లక్ష్యం ₹625, స్టాప్‌లాస్ ₹525; బజాజ్ కన్స్యూమర్ ₹490 పైన కొనుగోలు, లక్ష్యం ₹625, స్టాప్‌లాస్ ₹480గా సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!