

ప్రతి వారం సరికొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఈ వీకెండ్ కూడా ఆసక్తికరమైన కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. థియేటర్లలో సందడి చేసిన సినిమాలతో పాటు క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ మిస్టరీలు, యాక్షన్ అడ్వెంచర్లు, కామెడీ వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంట్లోనే ఉంటూ వీకెండ్‌ను వినోదభరితంగా గడపాలనుకునేవారి కోసం ఈ సినిమాలు, సిరీస్‌లు మంచి ఎంపికగా నిలవనున్నాయి.
ఈ జాబితాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (IMDb 7.3), కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘దాయరా’ (7.1), వరుస హత్యల మిస్టరీని ఛేదించే ‘మేడమ్ ఇన్‌స్పెక్టర్’ (5.9), కుటుంబాన్ని కాపాడేందుకు మాజీ సైనికుడు చేసే పోరాటాన్ని చూపించే ఇండోనేషియన్ యాక్షన్ థ్రిల్లర్ ‘నెవర్ సరెండర్’ (6.0) ఉన్నాయి. వీటితో పాటు హారర్, సైకలాజికల్ మిస్టరీ అంశాలతో సాగే ‘ది బాడీ’ (7.6), డైనోసార్ల నేపథ్యంలో తెరకెక్కిన ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ (5.8), భువన్ బామ్ నటించి రూపొందించిన నవ్వులు పూయించే కామెడీ సిరీస్ ‘ఢింఢోరా’ సీజన్ 1, 2 (8.7) కూడా ఈ వీకెండ్ వినోదాన్ని అందించనున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!