

మైక్రోసాఫ్ట్ 365 సర్వీసుల్లో గురువారం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సాంకేతిక అంతరాయం ఏర్పడింది. దీంతో అవుట్‌లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌తో పాటు ఇతర మైక్రోసాఫ్ట్ 365 అప్లికేషన్లు దాదాపు ఐదు గంటలకు పైగా పనిచేయలేదు. ఈ అంతరాయం కారణంగా వ్యక్తిగత వినియోగదారులతో పాటు సంస్థలు, కార్యాలయాల కార్యకలాపాలపైనా ప్రభావం పడింది. అంతేకాకుండా ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థలు అందించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలకు సంబంధించిన కనెక్టర్లలోనూ సమస్యలు తలెత్తాయి.
ఈ సాంకేతిక సమస్యపై స్పందించిన మైక్రోసాఫ్ట్.. సర్వర్లపై అదనపు లోడ్ పడటం వల్లే అంతరాయం ఏర్పడిందని వెల్లడించింది. వినియోగదారుల నుంచి ట్రాఫిక్ పెరగడం ఈ సమస్యకు కారణం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రభావితమైన సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కంపెనీ తెలిపింది. సర్వీసుల పునరుద్ధరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!