30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు

Writer: Pooja 09:47 AM, 30 సెప్టెంబర్, 2026
స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు

స్పామ్‌ కాల్స్‌ను కట్టడి చేసేందుకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వినియోగదారులు ప్రత్యేకంగా ఫిర్యాదు చేయకపోయినా, కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ ఆధారిత వ్యవస్థల ద్వారా అనుమానాస్పద స్పామర్లుగా గుర్తించిన వారిపై టెలికం సంస్థలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సవరించిన టెలికం కమర్షియల్‌ కమ్యూనికేషన్స్‌ కస్టమర్‌ ప్రిఫరెన్స్‌ నిబంధనల ప్రకారం, స్పామర్‌గా గుర్తించిన వారి కేవైసీ వివరాలను మళ్లీ ధ్రువీకరించడంతో పాటు అవసరమైన సమాచారాన్ని ఇతర టెలికం సంస్థలతో పంచుకోవాలి. నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే టెలికం సేవలను నిలిపివేయడం లేదా కనెక్షన్లను డిస్‌కనెక్ట్‌ చేయడం, తీవ్రమైన సందర్భాల్లో దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడం వంటి చర్యలు చేపట్టవచ్చు.

ఒకే పంపినవారికి సంబంధించిన పలు కాలింగ్‌ లైన్‌ ఐడెంటిఫికేషన్లు నిర్ణీత వ్యవధిలో అనుమానాస్పదంగా గుర్తించినా టెలికం సంస్థలు కలిసి చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు రూపొందించారు. మరోవైపు వినియోగదారులు తమకు అవసరం లేని ప్రమోషనల్‌ టెలిమార్కెటింగ్‌ కాల్స్‌ను స్వయంగా నిలిపివేసే అవకాశం కూడా ఉంటుంది. అన్ని కేటగిరీల ప్రమోషనల్‌ కమర్షియల్‌ కమ్యూనికేషన్లను నిలిపివేయాలంటే 1909 నంబరుకు BLOCK PROMO అని సందేశం పంపాలి. అయితే సేవలకు సంబంధించిన, లావాదేవీలకు సంబంధించిన, ప్రభుత్వ కమ్యూనికేషన్లు దీనివల్ల నిలిచిపోవు. సవరించిన నిబంధనలు దశలవారీగా అమల్లోకి రానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..

అక్టోబర్‌లో సిమెంట్‌ ధరలకు మళ్లీ రెక్కలు..

అక్టోబర్‌లో సిమెంట్‌ ధరలకు మళ్లీ రెక్కలు..

ట్యాగ్లు
ట్రాయ్స్పామ్ కాల్స్ఏఐ స్పామ్ గుర్తింపుటెలికం నిబంధనలుకాలర్ ఐడీవినియోగదారుల రక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్చరీలో స్వర్ణం కొల్లగొట్టిన చికిత, సాహిల్
క్రీడలు

ఆర్చరీలో స్వర్ణం కొల్లగొట్టిన చికిత, సాహిల్

నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జనరల్

నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక
బిజినెస్

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు
బిజినెస్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
జనరల్

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం
జనరల్

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు
రాజకీయాలు

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు
బిజినెస్

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?
బిజినెస్

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు
జనరల్

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

ఫౌజీ: ఆలస్యం...అమృతం?
సినిమాలు

ఫౌజీ: ఆలస్యం...అమృతం?

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్
రాజకీయాలు

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!