

జనగణనలో భాగంగా ఏర్పాటు చేసిన స్వీయగణన(సెల్ఫ్ ఎన్యూమరేషన్) పోర్టల్‌లో మతం కాలమ్ వివాదాస్పదమైంది. ‘ఇతరులు’ విభాగం కింద 287కి పైగా అప్షన్లతో డ్రాప్‌డౌన్ జాబితా కనిపించింది. ఇస్కాన్, రామకృష్ణ పరమహంస, శ్రీరామ్, శ్రీకృష్ణ, తిరుపతి బాలాజీ, బసవేశ్వర, రాందేవ్, తాంత్రిక్, యోగి వంటి పేర్లను ‘ఇతర మతాలు’గా చూపించారు. షియా, సున్నీ, మెథడిస్ట్, పెంటెకోస్టల్, ఖల్సా, సర్నా, బిష్ణోయ్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ రాష్ట్రాల కోసం సోమవారం సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. 287 ఆప్షన్లపై మీడియా కేంద్ర హోంశాఖను వివరణ కోరడంతో అదే రోజు డ్రాప్‌డౌన్ మెనూను పోర్టల్ నుంచి తొలగించారు. గత జనగణనల మాదిరిగానే ఈసారి కూడా మతం కాలమ్‌లో 7కేటగిరీలు ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధం, జైనం, ఇతరులు. ఇతరులు కింద ఇన్ని ఉప ఆప్షన్లు ఇవ్వడం ఇదే తొలిసారి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!