
సినిమాలు

పండుగల వేళ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సాధారణంగా ప్రతి నెలా విడుదల చేసే పన్నుల వాటాకు అదనంగా మరో ముందస్తు విడత నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం రూ.1,09,019 కోట్లను రాష్ట్రాలకు కేటాయించింది. పండుగల సమయంలో రాష్ట్రాల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు, ఖర్చులకు అవసరమైన నిధులు అందుబాటులో ఉండేలా ఈ ముందస్తు విడుదల ఉపయోగపడనుంది.
ఈ నిధుల కేటాయింపులో తెలంగాణకు రూ.2,370 కోట్లు దక్కనున్నాయి. అదనంగా అందనున్న ఈ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్థిక వనరులను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడ్పాటు పొందనుంది. పండుగల సమయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణతో పాటు నిధులు అందుకోనున్న ఇతర రాష్ట్రాలకు కూడా ఆర్థికంగా ఊరటనివ్వనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!