
సినిమాలు

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వేదికగా ఈక్వాలిటీ రన్ నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ రన్‌ను చిన్నజీయర్ స్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషితో పాటు పలువురు పాల్గొన్నారు. సమాజంలో సమానత్వ భావనను పెంపొందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈక్వాలిటీ రన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సమానత్వం, సామాజిక బాధ్యత, ప్రజా ఆరోగ్యం వంటి అంశాల ప్రాధాన్యతను ఈ రన్ చాటిచెప్పింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!