

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదంపై దర్యాప్తు తుది దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. 2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మందితో పాటు భూమిపై ఉన్న మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 260కి చేరింది.
ప్రమాదానికి గల కారణాలను గుర్తించే దర్యాప్తు దాదాపు పూర్తయిందని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. విచారణకు సంబంధించిన తుది నివేదికను త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నివేదికలో ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, దర్యాప్తులో వెలుగుచూసిన కీలక అంశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఈ విమాన ప్రమాదంపై తుది నివేదిక కోసం ఆసక్తి నెలకొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!