

మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వస్తానని ప్రకటించిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మహమ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటిపై దాడి జరిగింది. చట్టోగ్రామ్‌లోని ఆయన పూర్వీకుల ఇంటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటనతో దేశంలో శాంతిభద్రతల పరిస్థితిపై మరిన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, అవామీ లీగ్ దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఘర్షణలు మరింత విస్తరించకుండా, ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల మధ్య పెరుగుతున్న ఘర్షణలు, ఆస్తులపై దాడులతో బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి మరింత తీవ్రమవుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!