

చైనాలోని షెన్జెన్లో అరుదైన దౌత్యపరమైన ఘట్టం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే వేదికపైకి వచ్చారు. ఏపీఈసీ సదస్సులో ఈ ముగ్గురు అగ్రనేతలు కలిసి గ్రూప్ ఫొటోకు పోజులివ్వడం అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తించింది. ప్రపంచ రాజకీయాలు, భద్రత, ఆర్థిక సహకారం వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరిగే అవకాశం ఉండటంతో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదిలా ఉండగా, ట్రంప్, పుతిన్, జిన్పింగ్ మధ్య త్రైపాక్షిక భేటీ జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ సంక్షోభంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అణ్వాయుధ నియంత్రణ, కృత్రిమ మేధ (ఏఐ), అంతర్జాతీయ వాణిజ్య స్థిరత్వం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపగల అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు రానుండటంతో అంతర్జాతీయ సమాజం ఈ సమావేశంపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!