
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. బుధవారం నుంచి ఈ వాతావరణ పరిస్థితులు కొనసాగవచ్చని పేర్కొంది. ప్రజలు వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీజీఎస్ సూచించింది. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని హెచ్చరించింది. వర్షాలు కురిసే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!