

డ్రగ్స్, చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని సినీ హీరో వెంకటేశ్ పిలుపునిచ్చారు. యువతే భారతదేశానికి అతిపెద్ద బలమని, మాదకద్రవ్యాల వ్యసనం కారణంగా వారు చదువు, ఆరోగ్యం, భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిర్వహిస్తున్న ‘నషాముక్త్ భారత్ పాదయాత్ర’లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. జీవితం ఎంతో విలువైనదని, క్షణికమైన వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు.
2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్‌ను నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వెంకటేశ్ గుర్తుచేశారు. ఈ లక్ష్య సాధనకు ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంచాలని సూచించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చెబుతూ ‘నో టు డ్రగ్స్ – ఎస్ టు లైఫ్’ నినాదంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!