

న్యాయస్థాన విచారణలను అనధికారికంగా రికార్డు చేయడం, ప్రసారం చేయడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కఠిన ఆంక్షలు విధించింది. ప్రత్యక్షంగా జరిగే విచారణలతో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే విచారణలను కూడా సంబంధిత అధికారి ముందస్తు అనుమతి లేకుండా రికార్డు చేయడం పూర్తిగా నిషేధించింది. అనుమతి లేకుండా ఆడియో, వీడియోలు, ఫొటోలు లేదా స్క్రీన్‌షాట్లు తీయకూడదని స్పష్టం చేసింది.
అలాగే టీవీ ఛానళ్లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌ల ద్వారా కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదా రికార్డింగ్‌లను అప్‌లోడ్ చేయడంపై నిషేధం విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు (W.P. (Civil) No. 751 of 2026), ఏపీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ నిబంధనలను న్యాయవాదులు, కక్షిదారులు, మీడియా ప్రతినిధులు, సిబ్బంది తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. న్యాయస్థాన గౌరవం, పవిత్రతను కాపాడేందుకే ఈ ప్రకటన జారీ చేసినట్లు హైకోర్టు రిజిస్ట్రార్ వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!