

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల తాను శస్త్రచికిత్స చేయించుకుని కొంతకాలం ఐసీయూలో చికిత్స పొందినట్లు వెల్లడించారు. 83 ఏళ్ల అమితాబ్ తన బ్లాగ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ, వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ శస్త్రచికిత్స ఎందుకు చేయించుకున్నారు, ఎప్పుడు జరిగింది అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కోలుకునే ప్రక్రియే అత్యంత కఠినమైన దశ అని అమితాబ్ బచ్చన్ తన భావోద్వేగ పోస్టులో పేర్కొన్నారు. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, జీవితంలో ఒక దశలో ప్రతి ఒక్కరూ కష్టాలను ఎదుర్కొంటారని చెప్పారు. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ఆయనకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కల్కి సీక్వెల్‌తో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!