

2026 ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్‌కు ఖ్యాతి తీసుకొచ్చిన క్రీడాకారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి అత్యుత్తమ ప్రదర్శనను ముఖ్యమంత్రి కొనియాడారు. అంతర్జాతీయ వేదికపై దేశం, రాష్ట్రం పేరును నిలబెట్టిన క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
చంద్రబాబును కలిసిన వారిలో శ్రీ చరణి, గణేష్ మణిరత్నం, ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతిసురేఖ ఉన్నారు. మూడు క్రీడాంశాల్లో రాష్ట్ర క్రీడాకారులు మొత్తం 3 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలు సహా 8 పతకాలు సాధించారని శాప్ ఎండీ భరణి సీఎంకు వివరించారు. భవిష్యత్తులో మరింత మంది రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని చంద్రబాబు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!