

ఆంధ్రప్రదేశ్‌లో వెబ్‌ల్యాండ్ భూరికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడిన ముఠా గుట్టు రట్టయింది. రాష్ట్రంలో డిజిటల్ భూరికార్డుల వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. NIC లాగిన్‌ను ఉపయోగించి సుమారు 30 మంది వ్యక్తులకు సంబంధించిన భూరికార్డుల్లో నిందితులు అక్రమంగా మార్పులు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలోకి అనధికారికంగా ప్రవేశించి రికార్డులను తారుమారు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇండ్లచెరువు, పడమరలక్ష్మీపురం గ్రామాల్లో మొత్తం 6.55 ఎకరాల భూమికి సంబంధించిన వెబ్‌ల్యాండ్ రికార్డులను నిందితులు మార్చినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో 30 మంది భూరికార్డులు ట్యాంపరింగ్‌కు గురైనట్లు సమాచారం. డిజిటల్ భూరికార్డుల భద్రత, భూ యజమానుల హక్కుల పరిరక్షణపై ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!