

భారత రక్షణ రంగంలో మరో కీలక విజయం నమోదైంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'ప్రళయ్' క్వాసీ బాలిస్టిక్ క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ విజయంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రళయ్ క్షిపణి విజయవంతమైన పరీక్ష భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
ప్రళయ్ స్వల్ప శ్రేణికి చెందిన స్వదేశీ క్షిపణి. ఇది 500 నుంచి 1,000 కిలోల బరువున్న పేలోడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థతో రూపొందించిన ఈ క్షిపణి నిర్దేశించిన లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. దేశీయంగా క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడంలో ఈ విజయం కీలక ముందడుగుగా నిలవనుంది. భారత రక్షణ రంగంలో స్వావలంబన దిశగా డీఆర్డీవో సాధించిన మరో ముఖ్యమైన విజయంగా దీనిని పరిగణిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!