

మెగా కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి నెలకొంది. యువ కథానాయకుడు, చిరంజీవి మేనల్లుడు సాయి దుర్గా తేజ్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్‌తో ఆయన నిశ్చితార్థం గురువారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను రామ్‌చరణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ 10న హైదరాబాద్‌లో సాయి దుర్గా తేజ్, కిరణ్‌ల వివాహం జరగనుంది. దీంతో మెగా అభిమానుల్లో ఈ పెళ్లిపై ఆసక్తి నెలకొంది.
నిశ్చితార్థ వేడుకకు మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, నాగబాబు, నిహారిక కొణిదెల, లావణ్య త్రిపాఠి తదితరులు వేడుకలో పాల్గొన్నారు. అలాగే అల్లు అరవింద్, అల్లు స్నేహారెడ్డి, అల్లు బాబీ, అఖీరా నందన్, ఆద్య సహా కుటుంబ సభ్యులు సందడి చేశారు. సాయి దుర్గా తేజ్ స్నేహితులు మంచు మనోజ్, మౌనికా రెడ్డి, నవీన్ విజయ్ కృష్ణ, హర్ష చెముడు, వెంకీ కుడుముల తదితరులు కూడా హాజరై కాబోయే దంపతులను అభినందించారు. వేడుకలో మెగా కుటుంబ సభ్యులంతా కలిసి దిగిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!