
జనరల్

ఇప్పటికే భారీ వరదలతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన నేపాల్‌కు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. భోటేకోశి నదికి ఎగువ ప్రాంతంలో కొత్తగా ఓ సరస్సు ఏర్పడటంతో అది అకస్మాత్తుగా పొంగిపొర్లే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో దిగువ ప్రాంతాల్లో మరో భారీ వరద సంభవించే ప్రమాదం ఉందని అప్రమత్తం చేశారు.
కొత్త వరద హెచ్చరికల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీరాలకు దూరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో పలుచోట్ల ప్రజలు భయాందోళనకు గురై సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. ఇప్పటికే సంభవించిన వరదల నేపథ్యంలో సహాయక, సహాయ పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!