

యూట్యూబర్, రాజకీయ వ్యాఖ్యాత అనుభవ్ గుప్తా చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో చర్చకు దారితీశాయి. దీపావళి, హోలీ, ఈద్, క్రిస్మస్ పండుగల సందర్భంగా ప్రజలకు కలిగే ఇబ్బందులను పోలుస్తూ ఆయన ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. దీపావళి, హోలీ వేడుకలతో పోలిస్తే ఈద్, క్రిస్మస్ సందర్భంగా ప్రజలకు అదే స్థాయిలో అసౌకర్యం కలగదని అభిప్రాయపడ్డారు. తన వాదన తప్పని నిరూపించాలని సవాల్ కూడా విసిరారు. దీంతో పలువురు నెటిజన్లు ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఓ నెటిజన్ ఈద్ సందర్భంగా మేకలను బలి ఇచ్చే ఆచారాన్ని ప్రస్తావిస్తూ అనుభవ్ గుప్తా వాదనను ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన తాను జంతువులకు కలిగే ఇబ్బందుల గురించి కాకుండా, ప్రజలకు ఎదురయ్యే అసౌకర్యం గురించి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. విమర్శకులకు ఘాటుగా బదులివ్వడంతో చర్చ మరింత వేడెక్కింది. పండుగల నిర్వహణ, ప్రజలకు కలిగే అసౌకర్యం, వివిధ మతాల వేడుకలను ఒకే ప్రమాణాలతో అంచనా వేస్తున్నారా అనే అంశాలపై ఈ వివాదం విస్తృత చర్చకు దారితీసింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!