
జనరల్

ఏపీలో 43 మంది వైద్యులను సేవల నుంచి తొలగించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మరో 34 మంది వైద్యులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. అనధికారికంగా విధులకు హాజరుకాని వారిని ఉపేక్షించమని ఆయన స్పష్టం చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం చూపుతున్న వైద్యులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!