

బిగ్‌బాస్ తెలుగు 10 రియాలిటీ షో రసవత్తరంగా సాగుతోంది. ఈ షో నుంచి రెండో వారంలో ఎలిమినేట్ అయిన నటుడు కృష్ణుడు తాజాగా మీడియాతో మాట్లాడారు. హౌస్‌లో తన అనుభవాలతో పాటు తోటి కంటెస్టెంట్ల ఆట తీరుపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో టాప్-5కు చేరుకునే అవకాశం ఉన్న కంటెస్టెంట్లపై తన అంచనాలను పంచుకున్నారు. రోహిత్, త్రిగుణ్, అమన్, రామ్ ప్రసాద్, ముఖేష్ టాప్-5లో ఉండొచ్చని కృష్ణుడు పేర్కొన్నారు. వీరిలో త్రిగుణ్, రోహిత్ ఆట తీరు బిగ్‌బాస్ ఫార్మాట్‌కు అనుగుణంగా ఉందని ప్రశంసించారు. అమన్ అండర్‌డాగ్‌గా ముందుకు సాగుతున్నాడని, ముఖేష్ మాత్రం సేఫ్ గేమ్ ఆడుతున్నాడని విశ్లేషించారు.
హౌస్‌లో నిజాయితీగా ఉండటం ఒక్కటే సరిపోదని, వ్యూహాలు కూడా అవసరమని కృష్ణుడు అభిప్రాయపడ్డారు. తాను హౌస్‌లో పూర్తిగా షుగర్ మానేయడం వల్ల శారీరకంగా బలహీనపడ్డానని, ఆరోగ్యం సహకరించకపోవడంతో ఫిజికల్ టాస్కుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయానని తెలిపారు. అదే తన ఎలిమినేషన్‌కు ప్రధాన కారణాల్లో ఒకటిగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రతి క్షణం కంటెంట్ ఇవ్వడం బిగ్‌బాస్ హౌస్‌లో ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మిగిలిన కంటెస్టెంట్ల గేమ్‌పై కృష్ణుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!