

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు వేగవంతం చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు.ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని అధికారులను ప్రశ్నించారు. ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తికి జీ-9 రకం బొగ్గు అవసరమని అధికారులు వివరించగా.. సింగరేణిలో ఆ రకం బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు లేవని, సమీప భవిష్యత్తులోనూ లభ్యతపై స్పష్టత లేదని తెలిపారు. స్థానికంగా జీ-9 బొగ్గు అందుబాటులో లేనప్పుడు అదే సాంకేతికతతో ప్లాంట్‌ను ఎలా నిర్మించారని సీఎం, డిప్యూటీ సీఎం అధికారులను ప్రశ్నించారు.
యాదాద్రి ప్లాంట్‌ను పిట్‌హెడ్ ప్రాంతంలో కాకుండా దూరంగా నిర్మించడం వల్ల బొగ్గు రవాణా వ్యయం రాష్ట్రంపై అదనపు భారం మోపుతోందని అధికారులు సమావేశంలో వివరించారు. బొగ్గు సరఫరా విషయంలో సింగరేణితో పాటు మహానది కోల్‌ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి కొనుగోళ్లకు చర్యలు ప్రారంభించాలని సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశించారు. తక్షణమే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో చర్చించాలని భట్టి విక్రమార్కకు సీఎం సూచించారు. దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు వేగవంతం చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!