

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. బీసీలకు 34 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రిజర్వేషన్ అమలుతో వివిధ వర్గాలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటే అవకాశం ఉందని హైకోర్టు పేర్కొంది.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై తక్షణమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై గత విచారణల్లోనూ హైకోర్టు ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి గణాంకాలు, 34 శాతం కోటాను నిర్ణయించడానికి ఉన్న చట్టపరమైన, వాస్తవ ఆధారాలను సమర్పించాలని కోరింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!