

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు తాజా తీర్పుతో మార్గం సుగమమైంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 105, 1065ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని, గరిష్ఠంగా ఆరు వారాల్లోపు ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఇప్పటికే ముగిసిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏపీలో మున్సిపల్ సహా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించారు. మరోవైపు రాజకీయ వర్గాలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్, షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాయి. అక్టోబర్ 3 లేదా 5న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఆ తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించలేదు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!