

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మంగళవారం పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 720 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 471 ఎగ్జిక్యూటివ్, 249 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 11, 2026 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక దరఖాస్తు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్షను 2027 ఫిబ్రవరి 21న ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్ విధానంలో నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్ష ఆన్‌లైన్ తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. ఎగ్జిక్యూటివ్ విభాగంలో 203 డిప్యూటీ తహసీల్దార్, 176 డిప్యూటీ ఎంపీడీఓ, 40 గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఆఫీసర్, 29 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్సై పోస్టులు ఉన్నాయి. నాన్-ఎగ్జిక్యూటివ్ విభాగంలో 80 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, 91 సీనియర్ అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి, వేతనం, జోన్ల వారీగా ఖాళీలు, ఎంపిక విధానం, పరీక్షా సరళి తదితర పూర్తి వివరాలను APPSC అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించవచ్చు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!