

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. ఈ వ్యవస్థ సెప్టెంబర్ 21న వాయుగుండంగా, సెప్టెంబర్ 22న తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సెప్టెంబర్ 23 ఉదయం ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలోని పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది.
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో సెప్టెంబర్ 22న అతి భారీ వర్షాలు, సెప్టెంబర్ 23, 24 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచడంతో పాటు సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!