

బిహార్‌కు చెందిన మంటూ కుమార్ సంప్రదాయ మూలికలను ఉపయోగించి వివిధ రకాల లడ్డూలను తయారు చేస్తూ విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. రోహ్‌తాస్ జిల్లా ససారామ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు టర్నోవర్ సాధిస్తున్నారు. తొలుత ఉద్యోగం కోసం ముంబయి వెళ్లిన మంటూ.. అక్కడ మూడేళ్లకు పైగా పనిచేశారు. అయితే 2011లో బిహారీలను వెళ్లగొట్టాలనే నినాదంతో సాగిన ఉద్యమం సందర్భంగా ఎదురైన దాడులు, అవమానాల కారణంగా స్వస్థలానికి తిరిగి వచ్చారు. అనంతరం సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆయన కుటుంబానికి తరతరాలుగా మూలికలతో ఔషధాలు తయారు చేసే సంప్రదాయం ఉంది.
కుటుంబ అనుభవంతో పాటు తన పరిశోధన, ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మంటూ మూలికలతో లడ్డూల తయారీని ప్రారంభించారు. తొలుత చ్యవన్‌ప్రాశ్, మలబద్ధకం సమస్యలకు ఉపయోగించే సంప్రదాయ ఔషధాలను తయారు చేసిన ఆయన.. ప్రస్తుతం 15 రకాల లడ్డూలను అందిస్తున్నారు. శొంఠి, పచ్చి పసుపు, మెంతులు, అవిసె గింజలు, అశ్వగంధ వంటి పదార్థాలతో ప్రత్యేక లడ్డూలను తయారు చేస్తున్నారు. ఈ వ్యాపారం ద్వారా సుమారు 20 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పట్నాలోని ఖాదీ మాల్‌తో పాటు ప్రభుత్వ ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాల్లోనూ తన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!