

నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ మహా పాదయాత్ర ప్రారంభమైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై పార్టీకి ఎదురవుతున్న విమర్శలను తిప్పికొట్టే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ మహా పాదయాత్రలో ఎంపీలు ఈటల రాజేందర్, నగేష్‌తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ప్రాంతంలో సందడి నెలకొంది. SIRపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడంతో పాటు పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!