
సినిమాలు

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్థల విద్యార్థులకు ఆగస్టు నెలలో వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 8న రెండో శనివారం, ఆగస్టు 9న ఆదివారం సాధారణ సెలవులు కాగా, ఆగస్టు 10న బోనాల పండుగ సందర్భంగా సెలవు ఉండనుంది. అయితే విద్యాసంస్థలకు సంబంధించి బోనాల సెలవుపై అధికారిక ఉత్తర్వులు విద్యాశాఖ నుంచి రావాల్సి ఉంది.
ఆగస్టు 10న హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు ఘనంగా ముగియనున్నాయి. రంగం, పోతురాజుల విన్యాసాలు, ఘటం ఊరేగింపులు వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో కుటుంబాలతో కలిసి స్వగ్రామాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆగస్టులో తెలంగాణ విద్యాసంస్థలకు మొత్తం 11 రోజుల వరకు సెలవులు ఉండే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!