
జనరల్

‘అర్నబ్’ తుపాను ప్రభావంతో మార్షల్ ఐలాండ్స్‌కు చెందిన భారీ కార్గో నౌక ‘సిగ్మా పెరల్’ సముద్రంలో చిక్కుకున్నట్లు సమాచారం. విశాఖపట్నంలో సరకు దించి సింగపూర్‌కు వెళ్తుండగా, కేజీ బేసిన్‌లోని రవ్వ ఆయిల్ క్షేత్రం సమీపంలో నౌక నిలిచిపోయింది. ఇంజిన్ పనిచేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
నౌకలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు భారత కోస్ట్‌గార్డ్ అధికారులు చర్యలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ప్రాంతం నుంచి సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నట్లు సమాచారం. నౌక వద్దకు చేరుకుని పరిస్థితిని అంచనా వేసేందుకు కోస్ట్‌గార్డ్ నౌక ‘సుజయ్’ను పంపించారు. సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!