

మధ్యప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురిని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. బుధవారం పురి పేరును ప్రకటించడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన హర్దీప్ సింగ్ పురి పదవీకాలం నవంబరులో ముగియనుంది.
ఇంతకుముందు ఎనిమిది రాజ్యసభ స్థానాలకు బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పురి పేరు లేకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు, మంత్రి పదవిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదం నేపథ్యంలో ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించవచ్చనే ప్రచారం కూడా జరిగింది. ఈ పరిణామాల మధ్య మధ్యప్రదేశ్ ఉప ఎన్నికకు ఆయనను ఎంపిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఉన్న ఏకైక సిక్కు నేత కావడం కూడా ఈ నిర్ణయంలో పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చని కథనం పేర్కొంది. అయితే, దీనిపై పార్టీ అధికారికంగా ఎలాంటి కారణాన్ని వెల్లడించలేదు. ఈ ఉప ఎన్నికకు నవంబర్ 12న పోలింగ్ జరగనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!