

ఫ్లైదుబాయ్ విమాన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సరదాగా ఓ ఆఫర్ ఇచ్చారు. విమానంలో ఎదురైన దాడి సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు స్మిత్‌ను యూఏఈ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఫస్ట్‌క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’తో సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన స్మిత్‌ను పలకరించి, గాయాల నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందని అడిగారు. మరో రెండు నెలలు పట్టవచ్చని స్మిత్ చెప్పగా, కోలుకున్న తర్వాత పోరాటం ఎలా చేయాలో తనకు ఓ సెషన్ నిర్వహించాలని అధ్యక్షుడు సరదాగా అన్నారు. దీనికి స్మిత్ స్పందిస్తూ, అది తనకు లభించే గొప్ప గౌరవమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు తన కుటుంబ సభ్యులతో సమానమని జాయెద్ వ్యాఖ్యానించారు. వారికి ఏ ఇబ్బంది ఎదురైనా యూఏఈ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, విమానంలో జరిగిన దాడిలో స్మిత్ పుర్రెకు తీవ్ర గాయమైనట్లు వెలువడిన దృశ్యాల్లో కనిపించింది. కోపైలట్ హమామీ క్రాష్ యాక్స్‌తో ఆయనపై దాడి చేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసం స్మిత్ ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తిస్తూ యూఏఈ ప్రభుత్వం ఆయనను సత్కరించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!