
జనరల్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ కోర్టు ముందు కీలక విషయాలను వెల్లడించింది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శివరాజ్ రఘునాథ్ మోటేగావ్‌కర్, పరీక్షకు ముందే కెమిస్ట్రీ ప్రశ్నలను పొందేందుకు ప్రశ్నాపత్రాల తయారీ కమిటీలో ఉన్న పీవీ కులకర్ణికి రూ.5 లక్షలు చెల్లించినట్లు సీబీఐ తెలిపింది.
కులకర్ణి నిర్వహించిన కోచింగ్ తరగతులకు మోటేగావ్‌కర్ కుమారుడు హాజరయ్యాడని, అక్కడే ప్రశ్నలు అందించినట్లు ఆరోపించింది. మోటేగావ్‌కర్ ఫోన్‌లో లభించిన 36 ఫొటోల్లో 32 ఫొటోల్లో 132 కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నాయని, వాటిలో 111 ప్రశ్నలు ఎన్‌టీఏ రూపొందించిన నీట్-యూజీ మాస్టర్ ప్రశ్నపత్రంతో సరిపోలినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ ఆధారాలను దృష్టిలో ఉంచుకుని నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!